ఈమధ్య కారణాలేవైనా కావచ్చు, గుండెజబ్బుల బారిన పడడం, అవి మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అవడం చూస్తున్నాం. దీంతో ఛాతీలో నొప్పి అనిపించగానే అది గుండెజబ్బేమో అనే భయం, ఆందోళన చాలామందిని వేధిస్తుంటుంది. అసలు ఛాతీనొప్పి అనేది ఎన్నిరకాలుగా వస్తుందో, ప్రతీ ఛాతీనొప్పి గుండెజబ్బుకు సంకేతం కాదని చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి సివిల్ సర్జన్, సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మోక్షేశ్వరుడు.