డాక్టరుగా 54 ఏళ్ల అపార అనుభవం. ఆమె చేతుల్లో పునర్జన్మ పొంది, పురుడు పోసుకున్న తల్లీబిడ్డలు వేలాదిగా ఉంటారేమో. ఎన్నో కాంప్లికేటెడ్ గైనిక్ కేసులను సైతం ఆమె సింపుల్ గా పరిష్కరించేస్తారు. టీచింగ్ ద్వారా ఎందరికో వైద్యవిద్యనందించారు. సామాజిక సేవలో ఆమె ఎప్పుడు ముందువరసలో ఉంటారు. జీవితంలో ధైర్యంగా, స్వతంత్రంగా ఎదగాలనుకునే ఎందరో అమ్మాయిలకు తిరుగులేని స్ఫూర్తిగా నిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ.