పీల్చే గాలి తర్వాత తాగే నీరే అత్యంత ప్రధానమైనది. ఐతే నీళ్లు ఏవి తాగాలి అన్న దగ్గర నుంచి నీళ్లు ఎన్ని తాగాలి అనే దాకా అన్నీ భేతాళ ప్రశ్నలే. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆల్కలైన్ వాటర్ అనీ, మినరల్ వాటర్ అనీ, ఆర్వో వాటర్ అనీ, ఇవి గాక మనం తాగే రెగ్యులర్ కొళాయి నీళ్లు… ఇలా మార్కెట్లో ఎన్నో రకాల నీళ్లు ఉన్నాయి. వీటిలో ఏ నీళ్లు మంచివి, ఏవి తాగాలి అనే ఆసక్తికర వివరాలను చెబుతున్నారు ఆర్మీ వైద్యులు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బఖ్తాయార్ చౌదరి.