ఎవరో పరిచయస్థులే కనిపిస్తారు టక్కున పేరు గుర్తుకురాదు. అలాగే ఏదో సీన్ చూస్తాం, ఆ సినిమా పేరు మాత్రం గింజుకున్నా గుర్తుకురాదు. ఏదో వెదుకుదామని గూగుల్లోకి వెళతాం, అది మరిచిపోయి ఏదేదో సెర్చ్ చేస్తుంటతాం. రాత్రి ఏదో ఆలోచన మనసులో మెదలుతుంది, పొద్దున లేచేసరికి గుర్తుండదు. ఇలా ఆఁ అంటే మరిచిపోయే ఘటనలు ఎన్నో. ఇక మొబైల్ యుగం వచ్చాక మరుపు అన్నది మరింతగా పెరిగిపోతోంది. అసలీ మతిమరుపును ఎలా జయించాలో, ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలో చెబుతున్నారు ఆర్మీ వైద్యుడు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బఖ్తాయార్ చౌదరి.