ఎండలు మండిపోతున్నాయి. నెత్తిన ఓ కొలిమి పెట్టుకున్నట్టుంది సిచుయేషన్. కాసేపలా బయట తిరిగొచ్చినా, ఇంట్లోనే ఉన్నా కూడా డీహైడ్రేట్ అయిపోయి నీరసం, నిస్సత్తువ ఆవహిస్తుంటాయి. ఏ పనీ చేయబుద్ధి కాదు. ఇంకో రెండు నెలలు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారొచ్చు కూడా. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే నీరసం, నిస్సత్తువ, అలసట రాకుండా మన పనులు మనం చక్కగా చేసుకోవచ్చో చెబుతున్నారు న్యూట్రిషనిస్టు, వెల్ నెస్ కన్సల్టెంట్ డాక్టర్ లహరి సూరపనేని.