అన్నమా ? చపాతీనా? ఏది డేంజర్ ? Diabetic diet: Rice or Chapathi?
షుగర్ జబ్బు ఉంటే ఏం తినాలి? ఏం తినరాదు? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. కొందరేమో అన్నం మానేయాలి అంటారు. కొందరేమో అన్నం తినొచ్చు అంటారు. కొందరేమో చపాతి తినాలి అంటారు. ఇప్పుడు మిల్లెట్ డైట్, కీటో డైట్లు, ఇంటర్ మిట్టెంట్ డైట్లు కూడా వచ్చి చేరాయి. అందుకే షుగర్ కి ఏం తినాలనే విషయంలో పెద్ద గందరగోళం ఎప్పుడూ ఉంటుంది. మరీ ముఖ్యంగా షుగర్ ఉంటే అన్నమా? చపాతీనా? అన్నది ఓ పెద్ద భేతాళప్రశ్న.