wp_update-1706026294

మీ పిల్లలకు ఈ Food పెడితే IQ/Memory పెరుగుతుంది
00:41

మీ పిల్లలకు ఈ Food పెడితే IQ/Memory పెరుగుతుంది! School Children’s Best Diet

చిన్నపిల్లలది అద్భుతంగా ఎదిగే వయసు. ఆ వయసులో మంచి ఫుడ్ తీసుకుంటే బాడీ అండ్ మైండ్ రెండూ చక్కగా వికసిస్తాయి. మరీ ముఖ్యంగా స్కూలు కెళ్లే పిల్లలకు బ్యాలెన్స్డ్ డైట్ లేదా సమతులాహారం అందేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్డ్ లేదా సమతులాహారం అనగానే అదేదో బ్రహ్మపదార్థం అనుకుంటారు, పైగా అది మనకు కుదిరే వ్యవహారం కాదులే అని భావిస్తారు చాలామంది. స్కూలు పిల్లలకు శరీరం, బుద్ధి వికసించేలా మంచి డైట్ మనకు అందుబాటులో ఉన్న ఆహారంతోనే ఎలా అందించవచ్చో చెబుతున్నారు స్లేట్ స్కూల్ కరెస్పాండెంట్ వాసిరెడ్డి అమర్నాథ్.

Diabetes ఉంటే ఎలాంటి Snacks/అల్పాహారం తీసుకోవాలంటే?

డయాబెటిస్ ఉన్నప్పుడు మేజర్ మీల్స్ లో అన్నం/చపాతీ మోతాదు కొంత తగ్గించి, మీల్స్-మీల్స్ కి మధ్యలో స్నాక్స్/అల్పాహారం కింద కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ చక్కగా ఉంటుంది.

థైరాయిడ్ మందులు జీవితాంతం వాడాలా? సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయి?

థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా ఒడుదుడుకులకు లోనైనప్పుడు మనం బయటి నుంచి ట్యాబ్లెట్ల వాడతాం. ఐతే ఈ టాబ్లెట్లు జీవితాంతం వాడాలా? సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయి? ఈ వివరాలు చెబుతున్నారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అరుణ్ ముక్క

Late Marriages మంచివి కాదా? పిల్లల్ని కనడానికి బెస్ట్ ఏజ్ ఇదే! Dr Balamba

లేటు మ్యారేజీల గురించి, పిల్లల్ని కనడానికి సరైన వయసు గురించి, ఇంకా భవిష్యత్తులో తల్లిడండ్రుల అవసరం లేకుండానే పిల్లల్ని ల్యాబ్ లో పుట్టిస్తారా.. అనే విషయాలను చెబుతున్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ.

Alkaline/Mineral/RO Water ఏది మంచిది? తాగేనీళ్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

ఈ మధ్యకాలంలో ఆల్కలైన్ వాటర్ అనీ, మినరల్ వాటర్ అనీ, ఆర్వో వాటర్ అనీ, ఇవి గాక మనం తాగే రెగ్యులర్ కొళాయి నీళ్లు... ఇలా మార్కెట్లో ఎన్నో రకాల నీళ్లు ఉన్నాయి. వీటిలో ఏ నీళ్లు మంచివి, ఏవి తాగాలి అనే ఆసక్తికర వివరాలను చెబుతున్నారు ఆర్మీ వైద్యులు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బఖ్తాయార్ చౌదరి.

ChatGPT ఓ రెవల్యూషన్! స్టూడెంట్స్ కి మంచిదా? చెడ్డదా?

ఇటీవలికాలంలో విప్లవాత్మకంగా ముందుకొస్తున్న ChatGPT లెర్నింగ్ మోడ్యూల్ అనేది విద్యారంగంలో కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ChatGPT అనేది స్టూడెంట్సుకి మంచిదా, చెడ్డదా, ఎలా అర్థం చేసుకోవాలో విశ్లేషిస్తున్నారు విద్యాబోధన రంగంలో అపార అనుభవం కలిగిన స్లేట్ స్కూల్స్ కరెస్పాండెంట్ వాసిరెడ్డి అమర్ నాథ్.

Headache: తలనొప్పి ఎన్నిరకాలు, ఎప్పుడు ప్రమాదం?

కొందరికి పెద్ద సౌండ్స్ విన్నా, లైట్స్ చూసినా తలనొప్పి వస్తుంది. కొందరికి ఎసిడిటీ వల్ల తలనొప్పి వస్తుంది. కొందరికి తలకు ఓవైపు మాత్రమే విపరీతంగా తలనొప్పి వస్తుంది. కొందరికి గంట కొట్టినట్టు ఒకే టైంకి తలనొప్పి వస్తుంది. కొందరికి సూసైడల్ హెడేక్స్ లా వస్తాయి. ఇలా తలనొప్పులు చాలా రకాలుంటాయి.

ఎండాకాలంలో నీరసం, నిస్సత్తువ రాకుండా ఈ ఫుడ్ తీసుకోండి

ఎండలు మండిపోతున్నాయి. నెత్తిన ఓ కొలిమి పెట్టుకున్నట్టుంది సిచుయేషన్. కాసేపలా బయట తిరిగొచ్చినా, ఇంట్లోనే ఉన్నా కూడా డీహైడ్రేట్ అయిపోయి నీరసం, నిస్సత్తువ ఆవహిస్తుంటాయి.

యూరిన్ రంగు I యూరిక్ యాసిడ్ I ఎక్కువ సార్లు మూత్రం దేనికి సంకేతం ?

మనలో చాలామందికి యూరిన్/మూత్రానికి సంబంధించి ఎన్నో అనుమానాలు, అపోహలు. యూరిన్ ఏ రంగులో ఉండాలి, తెలుపా, పసుపా? వాసన వస్తే ప్రాబ్లమా? మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవచ్చా? రాత్రిపూట ఎన్నిసార్లు మూత్రానికి వెళ్లొచ్చు,

బాహుబలి కాలేయాన్ని కాపాడుకోండిలా !!

చాలావరకు ఎన్ని ఇబ్బందులొచ్చినా సొంతంగా తట్టుకుని నయం చేసుకునే అద్భుత సామర్థ్యం కాలేయం సొంతం. అయినప్పటికీ మారిన జీవనశైలి, అలవాట్లు, అనేక కారణాల వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం.

గుండెజబ్బుల రిస్క్ ఎవరిలో ఎక్కువ, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి! Heart Disease Risk

గుండెపోటు మరణాలు ఇటీవల అందరినీ భయపెడుతున్న నేపథ్యంలో గుండెజబ్బుల రిస్క్ ఎవరికెక్కువ, గుండె జబ్బులు రాకుండా ఎలా జాగ్రత్తపడాలో చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాస్పత్రి సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకరరెడ్డి.
Lahari_Summer 3 fruits
03:07

Summerలో ఈ మూడు Fruits ఎందుకు కచ్చితంగా తినాలంటే !!

డీహైడ్రేషన్ ను తట్టుకోవడానికి మనం నీళ్లతో పాటు మజ్జిగ, కొబ్బరిబొండాలు తీసుకుంటాం. ఇక మామిడి పండు ఎలాగూ తింటుంటాం. అయితే ఎండాకాలంలో ఇంకో మూడు పండ్లు నీరసం, నిస్సత్తువను అధగమించడానికి అద్భుతంగా పనిచేస్తాయని, ఆ పండ్లలో ఉంటే పోషకాలు, వాటిని ఎలా తీసుకోవాలో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి సూరపనేని.