Telangana Weather: తెలంగాణలో తుఫాన్ అలర్ట్
ప్రస్తుతం కామారెడ్డిలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురుస్తోంది. అర్ధరాత్రి వరకు ఈ తుపాను సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్న తెలంగాణ ప్రజలకు ఈ వార్తా కాస్త ఊరటనిస్తోంది. గత మూడు రోజులుగా ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతలు సోమవారం కాస్త తగ్గటం గమనార్హం.
(Visited 56 times, 1 visits today)