సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎస్.యు.సి.ఐ (కమ్యూనిస్ట్) పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు!
SUCI కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఆర్ గంగాధర్ సికింద్రాబాద్ నియోజకవర్గానికి లోక్ సభ అభ్యర్థిగా ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు. వందలాదిమంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు ర్యాలీగా తరలిరాగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు.
గంగాధర్ మాట్లాడుతూ తమ పార్టీ నిరంతరాయంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తోందని ఈ క్రమంలోనే ఎన్నికల్లో పాల్గొంటుందని తమ పార్టీ గెలిస్తే ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మురహరి, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి తేజ రాష్ట్ర నాయకులు భరత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
(Visited 49 times, 1 visits today)