యూకె పార్లమెంట్ బరిలో మన తెలుగు బిడ్డ.

లేబర్ పార్టీ అభ్యర్థిగా ఉదయ్ నాగరాజు.

నాగరాజుది ఉమ్మడి కరీంనగర్ జిల్లా శనిగరం.
బ్రిటన్ పార్లమెంట్ ఎన్ని కల్లోపోటీకి తెలుగు బిడ్డఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీనుంచి ఎన్నికల బరిలో నిలుస్తునారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ కాండిడేట్ గా పార్టీపక్రటించింది. “నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ “బౌండరీ కమిషన్ “సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం.


ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కు లస్ పక్రారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నా యి. ప్రస్తుతం బ్రిటన్ లోనూ ఎన్నికల హడావిడి మొదలయింది. భారతదేశంలో ఇప్పటికే ఎన్ని కలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనేబ్రిటన్, అమెరికాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ – పాలస్తీనా సంఘర్షణ, పప్రంచ వ్యా ప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్, అమెరికా ఎన్ని కల మీద పప్రంచ దేశాల దృష్టి కేంద్రీక్రీృతమై ఉంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి
కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికిచెందిన నాగరాజు హనుమంత రావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు.


చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. బ్రిటన్ లోని పప్రంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ చేసారు. పప్రంచ సమాజం, బావితరాలపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏ ఐ పాలసీలాబ్స్ నెలకొల్పా రు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు.

స్కూ ల్ గవర్నర్ గా, వాలంటీర్ గా, విస్స్తృత రాజకీయ పచ్రారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటికీ పచ్రారంతో సామాన్యుల కష్టాలఫై మంచి అవగాహన సాధించారు. దాదాపు అన్ని సర్వే సంస్థల పక్రారం ఈ ఎన్ని కల్లో లేబర్ పార్టీఅఖండ విజయం సాధించి పభ్రుత్వం నెలకొల్పనుంది.


ప్రఖ్యాత తెలుగు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఈ సర్వేల ఆధారంగా కన్సర్వేటివ్ పార్టీ కనీవిని ఎరుగని రీతిలో ఓడిపోయి లేబర్ పార్టీగెలుస్తుందని విశ్లేషించారు. గత కొన్ని ఎన్ని కల్లోనూ లేబర్ పార్టీఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నా రు. ఈ నెల జరిగిన కౌన్సిలర్ మరియు రాష్ట్ర మేయర్ ఎన్నికలోనూ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. దీనితో తెలుగు ముద్దు బిడ్డఉదయ్ నాగరాజు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్ని కల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

లండన్ ప్రతినిధి: వి. ఎం. రెడ్డి

(Visited 36 times, 1 visits today)

About The Author

You Might Be Interested In

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *