ఎప్పుడైనా సరే జబ్బు రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమం. ఒకసారి ఏదైనా సమస్య వస్తే దానికి మందులో మాకులో వాడి నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలా కాకుండా పరిస్థితి సర్జరీ దాకా కూడా వెళ్లే అవసరం కూడా పడొచ్చు. ఇలాంటప్పుడు ఒకప్పటిలా ఇప్పుడు కేవలం కోత కోసి చేసే సర్జరీలు మాత్రమే కాకుండా ల్యాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీలాంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ ఆపరేషన్ మంచిదా, ల్యాప్రోస్కోపీ లాంటి సర్జరీలు బెటరా అనే అనుమానాలకు సమాధానమిస్తున్నారు జనరల్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సుజీత్ కుమార్.