వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.
2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ కి విధేయుడుగా, అధినేత తో కలిసిపనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు.
(Visited 38 times, 1 visits today)