10 నిమిషాల కునుకు లెక్కలేనన్ని లాభాలు!

హైబీపీ సమస్య ఉంటే బీపీ తగ్గుతుంది. ఇది హార్ట్ ఎటాక్ రిస్కును గణనీయంగా తగ్గిస్తుంది. అలసట, చికాకు లాంటి నెగెటివ్ మూడ్స్ ని తగ్గించి పాజిటివిటీ, టాలరెన్స్ లెవెల్స్ పెంచుతుంది. ఇంకా లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అలర్ట్ నెస్, ఫోకస్, మెమొరీ పవర్ కూడా పెరుగుతాయి. ఇవండీ కునుకు వల్ల లాభాలు.

Alkaline/Mineral/RO Water ఏది మంచిది? తాగేనీళ్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

ఈ మధ్యకాలంలో ఆల్కలైన్ వాటర్ అనీ, మినరల్ వాటర్ అనీ, ఆర్వో వాటర్ అనీ, ఇవి గాక మనం తాగే రెగ్యులర్ కొళాయి నీళ్లు... ఇలా మార్కెట్లో ఎన్నో రకాల నీళ్లు ఉన్నాయి. వీటిలో ఏ నీళ్లు మంచివి, ఏవి తాగాలి అనే ఆసక్తికర వివరాలను చెబుతున్నారు ఆర్మీ వైద్యులు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బఖ్తాయార్ చౌదరి.

Allergic Rhinitis Remedies

మనలో చాలామందికి పొద్దున లేస్తే కొందరికి విపరీతమైన తుమ్ములు వస్తాయి. ముక్కు కారుతుంది. కొందరిలో ముక్కు బ్లాక్ కూడా ఉండొచ్చు. కొందరిలో గొంతులో గరగర, గొంతునొప్పి కూడా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కనిపించే సమస్యను అలర్జిక్ రైనైటిస్ అంటారు. అసలీ సమస్య ఎందుకొస్తుంది, ఎలా తగ్గించుకోవాలో చెబుతున్నారు రష్ హాస్పిటల్ ఇ.ఎన్.టి సర్జన్ డాక్టర్ ప్రతిభారెడ్డి.

ChatGPT ఓ రెవల్యూషన్! స్టూడెంట్స్ కి మంచిదా? చెడ్డదా?

ఇటీవలికాలంలో విప్లవాత్మకంగా ముందుకొస్తున్న ChatGPT లెర్నింగ్ మోడ్యూల్ అనేది విద్యారంగంలో కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ChatGPT అనేది స్టూడెంట్సుకి మంచిదా, చెడ్డదా, ఎలా అర్థం చేసుకోవాలో విశ్లేషిస్తున్నారు విద్యాబోధన రంగంలో అపార అనుభవం కలిగిన స్లేట్ స్కూల్స్ కరెస్పాండెంట్ వాసిరెడ్డి అమర్ నాథ్.

Diabetes ఉంటే ఎలాంటి Snacks/అల్పాహారం తీసుకోవాలంటే?

డయాబెటిస్ ఉన్నప్పుడు మేజర్ మీల్స్ లో అన్నం/చపాతీ మోతాదు కొంత తగ్గించి, మీల్స్-మీల్స్ కి మధ్యలో స్నాక్స్/అల్పాహారం కింద కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ చక్కగా ఉంటుంది.

Diabetic Diet Explained in Telugu

షుగర్ జబ్బు ఉంటే ఏం తినాలిఅనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. కొందరేమో అన్నం మానేయాలి అంటారు. కొందరేమో చపాతి తినాలి అంటారు. ఇప్పుడు మిల్లెట్ డైట్, కీటో డైట్లు, ఇంటర్ మిట్టెంట్ డైట్లు కూడా వచ్చి చేరాయి.

Headache: తలనొప్పి ఎన్నిరకాలు, ఎప్పుడు ప్రమాదం?

కొందరికి పెద్ద సౌండ్స్ విన్నా, లైట్స్ చూసినా తలనొప్పి వస్తుంది. కొందరికి ఎసిడిటీ వల్ల తలనొప్పి వస్తుంది. కొందరికి తలకు ఓవైపు మాత్రమే విపరీతంగా తలనొప్పి వస్తుంది. కొందరికి గంట కొట్టినట్టు ఒకే టైంకి తలనొప్పి వస్తుంది. కొందరికి సూసైడల్ హెడేక్స్ లా వస్తాయి. ఇలా తలనొప్పులు చాలా రకాలుంటాయి.