3tv Health Official Trailor
00:46

ఆరోగ్యమే మహాభాగ్యం!!

నేడు ఆరోగ్యం అన్నది కన్ఫ్యూజన్ల క్రాస్ రోడ్స్ లో నిల్చుంది! ఈ నేపథ్యంలో.. అనుమానాల్ని, అపోహల్ని పటాపంచలు చేసి.. ఖచ్చితమైన, విలువైన మెడికల్ సమాచారంతో ఆరోగ్యామృతాన్ని అందరికీ పంచేందుకు ఇరవయ్యేళ్ల పైచిలుకు మెడికల్ జర్నలిజపు అనుభవాన్ని రంగరించి తెలుగు ప్రజల ముందుకు తీసుకు వస్తోంది మీ 3tv హెల్త్.
Laproscopy_Dr Sujith kumar_3tv Health
02:48

ఓపెన్ ఆపరేషన్, ల్యాప్రోస్కోపీ సర్జరీ. ఏది మంచిది ?

ఎప్పుడైనా సరే జబ్బు రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమం. ఒకసారి ఏదైనా సమస్య వస్తే దానికి మందులో మాకులో వాడి నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలా కాకుండా పరిస్థితి సర్జరీ దాకా కూడా వెళ్లే అవసరం కూడా పడొచ్చు. ఇలాంటప్పుడు ఒకప్పటిలా ఇప్పుడు కేవలం కోత కోసి చేసే సర్జరీలు మాత్రమే కాకుండా ల్యాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీలాంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి.
chest pain and heart problem
07:52

ఛాతీలో వచ్చే ప్రతీ నొప్పి గుండెజబ్బు కాదు! Chest Pain Types

అసలు ఛాతీనొప్పి అనేది ఎన్నిరకాలుగా వస్తుందో, ప్రతీ ఛాతీనొప్పి గుండెజబ్బుకు సంకేతం కాదని చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి సివిల్ సర్జన్, సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మోక్షేశ్వరుడు.
prabhakar_3 copy
14:56

సొంతంగా Tests చేయించుకుని, సొంతంగా మందులు వాడడం మంచిదేనా? Dr Prabhakar Reddy | 3tv Health

సొంతంగా టెస్టులు చేయించుకుని, సొంతంగా మనమే ఏదేదో ఊహించుకుని, మందులు వాడడం మంచిది కాదని చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకరరెడ్డి.

బాహుబలి కాలేయాన్ని కాపాడుకోండిలా !!

చాలావరకు ఎన్ని ఇబ్బందులొచ్చినా సొంతంగా తట్టుకుని నయం చేసుకునే అద్భుత సామర్థ్యం కాలేయం సొంతం. అయినప్పటికీ మారిన జీవనశైలి, అలవాట్లు, అనేక కారణాల వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం.

Headache: తలనొప్పి ఎన్నిరకాలు, ఎప్పుడు ప్రమాదం?

కొందరికి పెద్ద సౌండ్స్ విన్నా, లైట్స్ చూసినా తలనొప్పి వస్తుంది. కొందరికి ఎసిడిటీ వల్ల తలనొప్పి వస్తుంది. కొందరికి తలకు ఓవైపు మాత్రమే విపరీతంగా తలనొప్పి వస్తుంది. కొందరికి గంట కొట్టినట్టు ఒకే టైంకి తలనొప్పి వస్తుంది. కొందరికి సూసైడల్ హెడేక్స్ లా వస్తాయి. ఇలా తలనొప్పులు చాలా రకాలుంటాయి.

జలుబు, తుమ్ములు, ఎలర్జీ ఉందని ఈ ట్యాబ్లెట్స్ వాడకండి !!

యాంటీ హిస్టమైన్ మందులు అంత మంచివి కాదని, అడిక్షన్ లా తయారవుతాయని, పైగా వాటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, నాచురల్ మార్గాలేవో చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ మోక్షేశ్వరుడు.

Alkaline/Mineral/RO Water ఏది మంచిది? తాగేనీళ్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

ఈ మధ్యకాలంలో ఆల్కలైన్ వాటర్ అనీ, మినరల్ వాటర్ అనీ, ఆర్వో వాటర్ అనీ, ఇవి గాక మనం తాగే రెగ్యులర్ కొళాయి నీళ్లు... ఇలా మార్కెట్లో ఎన్నో రకాల నీళ్లు ఉన్నాయి. వీటిలో ఏ నీళ్లు మంచివి, ఏవి తాగాలి అనే ఆసక్తికర వివరాలను చెబుతున్నారు ఆర్మీ వైద్యులు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బఖ్తాయార్ చౌదరి.

థైరాయిడ్ మందులు జీవితాంతం వాడాలా? సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయి?

థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా ఒడుదుడుకులకు లోనైనప్పుడు మనం బయటి నుంచి ట్యాబ్లెట్ల వాడతాం. ఐతే ఈ టాబ్లెట్లు జీవితాంతం వాడాలా? సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయి? ఈ వివరాలు చెబుతున్నారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అరుణ్ ముక్క

ఎండలో ఎంతసేపు ఉంటే Vitamin D వస్తుంది? Dr Sujeeth Kumar

ఒంట్లో అనేక హార్మోన్ల పనితీరును ప్రభావితం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తి బాగుండేలా చేయడంలో విటమిన్-డి పాత్ర చాలా ప్రధానమైంది. ఐతే మనలో వందలో 98 మందికి విటమిన్-డి లోపం కనిపిస్తోంది. దీంతో అనేక జబ్బులు కూడా కనిపిస్తున్నాయి.

పిల్లల్లో జంక్ ఫుడ్ అలవాటును ఇలా మాన్పించండి I Dr Lahari 

పిల్లలు ఇంట్లో వండిన ఫుడ్ కంటే కూడా పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు, బిర్యానీలు, ఐస్ క్రీమ్స్ వీటికే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ ఫుడ్ లో కేవలం కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడమే కాకుండా, అనవసరమైన ఫ్లేవర్లు, కలర్లు, ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటారు. అందుకే వీటిని జంక్ ఫుడ్ అంటారు. పిల్లల్లో జంక్ ఫుడ్ అలవాటును ఎలా మాన్పించాలో, ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే ఎలాంటి ఆహారాలను తయారు చేసి పెట్టవచ్చో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ ఎక్స్ పర్ట్ డాక్టర్ లహరి సూరపనేని.

Diabetic Diet Explained in Telugu

షుగర్ జబ్బు ఉంటే ఏం తినాలిఅనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. కొందరేమో అన్నం మానేయాలి అంటారు. కొందరేమో చపాతి తినాలి అంటారు. ఇప్పుడు మిల్లెట్ డైట్, కీటో డైట్లు, ఇంటర్ మిట్టెంట్ డైట్లు కూడా వచ్చి చేరాయి.