10 నిమిషాల కునుకు లెక్కలేనన్ని లాభాలు!

హైబీపీ సమస్య ఉంటే బీపీ తగ్గుతుంది. ఇది హార్ట్ ఎటాక్ రిస్కును గణనీయంగా తగ్గిస్తుంది. అలసట, చికాకు లాంటి నెగెటివ్ మూడ్స్ ని తగ్గించి పాజిటివిటీ, టాలరెన్స్ లెవెల్స్ పెంచుతుంది. ఇంకా లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అలర్ట్ నెస్, ఫోకస్, మెమొరీ పవర్ కూడా పెరుగుతాయి. ఇవండీ కునుకు వల్ల లాభాలు.

Allergic Rhinitis Remedies

మనలో చాలామందికి పొద్దున లేస్తే కొందరికి విపరీతమైన తుమ్ములు వస్తాయి. ముక్కు కారుతుంది. కొందరిలో ముక్కు బ్లాక్ కూడా ఉండొచ్చు. కొందరిలో గొంతులో గరగర, గొంతునొప్పి కూడా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కనిపించే సమస్యను అలర్జిక్ రైనైటిస్ అంటారు. అసలీ సమస్య ఎందుకొస్తుంది, ఎలా తగ్గించుకోవాలో చెబుతున్నారు రష్ హాస్పిటల్ ఇ.ఎన్.టి సర్జన్ డాక్టర్ ప్రతిభారెడ్డి.

Diabetic Diet Explained in Telugu

షుగర్ జబ్బు ఉంటే ఏం తినాలిఅనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. కొందరేమో అన్నం మానేయాలి అంటారు. కొందరేమో చపాతి తినాలి అంటారు. ఇప్పుడు మిల్లెట్ డైట్, కీటో డైట్లు, ఇంటర్ మిట్టెంట్ డైట్లు కూడా వచ్చి చేరాయి.

పిల్లల్లో జంక్ ఫుడ్ అలవాటును ఇలా మాన్పించండి I Dr Lahari 

పిల్లలు ఇంట్లో వండిన ఫుడ్ కంటే కూడా పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు, బిర్యానీలు, ఐస్ క్రీమ్స్ వీటికే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ ఫుడ్ లో కేవలం కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడమే కాకుండా, అనవసరమైన ఫ్లేవర్లు, కలర్లు, ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటారు. అందుకే వీటిని జంక్ ఫుడ్ అంటారు. పిల్లల్లో జంక్ ఫుడ్ అలవాటును ఎలా మాన్పించాలో, ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే ఎలాంటి ఆహారాలను తయారు చేసి పెట్టవచ్చో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ ఎక్స్ పర్ట్ డాక్టర్ లహరి సూరపనేని.

ఎండలో ఎంతసేపు ఉంటే Vitamin D వస్తుంది? Dr Sujeeth Kumar

ఒంట్లో అనేక హార్మోన్ల పనితీరును ప్రభావితం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తి బాగుండేలా చేయడంలో విటమిన్-డి పాత్ర చాలా ప్రధానమైంది. ఐతే మనలో వందలో 98 మందికి విటమిన్-డి లోపం కనిపిస్తోంది. దీంతో అనేక జబ్బులు కూడా కనిపిస్తున్నాయి.

థైరాయిడ్ మందులు జీవితాంతం వాడాలా? సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయి?

థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా ఒడుదుడుకులకు లోనైనప్పుడు మనం బయటి నుంచి ట్యాబ్లెట్ల వాడతాం. ఐతే ఈ టాబ్లెట్లు జీవితాంతం వాడాలా? సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయి? ఈ వివరాలు చెబుతున్నారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అరుణ్ ముక్క

Alkaline/Mineral/RO Water ఏది మంచిది? తాగేనీళ్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

ఈ మధ్యకాలంలో ఆల్కలైన్ వాటర్ అనీ, మినరల్ వాటర్ అనీ, ఆర్వో వాటర్ అనీ, ఇవి గాక మనం తాగే రెగ్యులర్ కొళాయి నీళ్లు... ఇలా మార్కెట్లో ఎన్నో రకాల నీళ్లు ఉన్నాయి. వీటిలో ఏ నీళ్లు మంచివి, ఏవి తాగాలి అనే ఆసక్తికర వివరాలను చెబుతున్నారు ఆర్మీ వైద్యులు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బఖ్తాయార్ చౌదరి.

Headache: తలనొప్పి ఎన్నిరకాలు, ఎప్పుడు ప్రమాదం?

కొందరికి పెద్ద సౌండ్స్ విన్నా, లైట్స్ చూసినా తలనొప్పి వస్తుంది. కొందరికి ఎసిడిటీ వల్ల తలనొప్పి వస్తుంది. కొందరికి తలకు ఓవైపు మాత్రమే విపరీతంగా తలనొప్పి వస్తుంది. కొందరికి గంట కొట్టినట్టు ఒకే టైంకి తలనొప్పి వస్తుంది. కొందరికి సూసైడల్ హెడేక్స్ లా వస్తాయి. ఇలా తలనొప్పులు చాలా రకాలుంటాయి.

బాహుబలి కాలేయాన్ని కాపాడుకోండిలా !!

చాలావరకు ఎన్ని ఇబ్బందులొచ్చినా సొంతంగా తట్టుకుని నయం చేసుకునే అద్భుత సామర్థ్యం కాలేయం సొంతం. అయినప్పటికీ మారిన జీవనశైలి, అలవాట్లు, అనేక కారణాల వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం.