చిన్నపిల్లలది అద్భుతంగా ఎదిగే వయసు. ఆ వయసులో మంచి ఫుడ్ తీసుకుంటే బాడీ అండ్ మైండ్ రెండూ చక్కగా వికసిస్తాయి. మరీ ముఖ్యంగా స్కూలు కెళ్లే పిల్లలకు బ్యాలెన్స్డ్ డైట్ లేదా సమతులాహారం అందేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్డ్ లేదా సమతులాహారం అనగానే అదేదో బ్రహ్మపదార్థం అనుకుంటారు, పైగా అది మనకు కుదిరే వ్యవహారం కాదులే అని భావిస్తారు చాలామంది. స్కూలు పిల్లలకు శరీరం, బుద్ధి వికసించేలా మంచి డైట్ మనకు అందుబాటులో ఉన్న ఆహారంతోనే ఎలా అందించవచ్చో చెబుతున్నారు స్లేట్ స్కూల్ కరెస్పాండెంట్ వాసిరెడ్డి అమర్నాథ్.