Osmania Unversity: కరెంటు, నీటి కొరతతో ఉస్మానియా హాస్టల్ మూసివేత…విద్యార్థుల ఆగ్రహం.
నీటి కొరత, కరెంటు కొరత వల్ల ఉస్మానియా యూనివర్శిటీ హస్టల్స్ కి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్టు యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. మే ఒకటి నుంచి మే 31 వరకు హాస్టల్ మూసివేస్తున్నట్టు, విద్యార్థులు ఆ మేరకు సహకరించాలని ఛీఫ్ వార్డెన్ తెలిపారు. ఐతే నిన్ననే ఉస్మానియా లేడీస్ హాస్టల్ విద్యార్థినులు నీరు, విద్యుత్తు సరఫరా చేయాలని ధర్నా చేశారు. హాస్టల్ మూసివేతపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(Visited 40 times, 1 visits today)