విద్య, వైద్యం వ్యాపారంగా తయారై, బాగా ఖరీదైపోయిన కాలంలో మనం జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కాస్తోకూస్తో తక్కువ ధరలకే అన్ని రకాల ల్యాబ్ టెస్టులు, మందులు, వైద్యసేవలు లభించడం నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి. దాదాపు 30 ఏళ్లుగా విద్యకు నోచుకోని వేలాది మంది పిల్లలకు ఉచితంగా చదువులందిస్తున్న HEAL, Health And Education for All అనే ఎన్జీవో ఇటీవలే హైదరాబాద్ పంజాగుట్టాలో HEAL వైద్య సేవల సెంటర్ని ప్రారంభించింది. HEAL వ్యవస్థాపకులు, ప్రముఖ కమ్యూనిటీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ HEAL సేవల గురించి ఈ వీడియోలో తెలియజేస్తారు.