బ్రేక్ఫాస్ట్ కింగ్ లా; లంచ్ యువరాజులా; డిన్నర్ మాత్రం పేదవాడిలా చేయాలని చెబుతుంటారు. కానీ మన దగ్గర ఇంటిల్లిపాది కూచుని కాస్తోకూస్తో నింపాదిగా తినేది రాత్రిపూట డిన్నరే. ఆ డిన్నర్ కాస్త ఎక్కువగానే తింటారు. అది కూడా సిటీల్లో అయితే బాగా పొద్దుపోయాక రాత్రి భోజనం చేయడం అలవాటవుతోంది. ఇది అనారోగ్యకరమని డాక్టర్లు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ ఉంటే మాత్రం రాత్రిపూట భోజనం ఏ టైంకి తినాలి, ఎంత మోతాదులో తినాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాల్లో చాలతా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కన్సల్టెంట్ డాక్టర్ లహరి సూరపనేని.