చాలావరకు ఎన్ని ఇబ్బందులొచ్చినా సొంతంగా తట్టుకుని నయం చేసుకునే అద్భుత సామర్థ్యం కాలేయం సొంతం. అయినప్పటికీ మారిన జీవనశైలి, అలవాట్లు, అనేక కారణాల వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం.
ఎప్పుడైనా సరే జబ్బు రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమం. ఒకసారి ఏదైనా సమస్య వస్తే దానికి మందులో మాకులో వాడి నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలా కాకుండా పరిస్థితి సర్జరీ దాకా కూడా వెళ్లే అవసరం కూడా పడొచ్చు. ఇలాంటప్పుడు ఒకప్పటిలా ఇప్పుడు కేవలం కోత కోసి చేసే సర్జరీలు మాత్రమే కాకుండా ల్యాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీలాంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి.