ఇటీవలికాలంలో విప్లవాత్మకంగా ముందుకొస్తున్న ChatGPT లెర్నింగ్ మోడ్యూల్ అనేది విద్యారంగంలో కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ChatGPT అనేది స్టూడెంట్సుకి మంచిదా, చెడ్డదా, ఎలా అర్థం చేసుకోవాలో విశ్లేషిస్తున్నారు విద్యాబోధన రంగంలో అపార అనుభవం కలిగిన స్లేట్ స్కూల్స్ కరెస్పాండెంట్ వాసిరెడ్డి అమర్ నాథ్.
యాంటీ హిస్టమైన్ మందులు అంత మంచివి కాదని, అడిక్షన్ లా తయారవుతాయని, పైగా వాటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, నాచురల్ మార్గాలేవో చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ మోక్షేశ్వరుడు.
ఈ మధ్యకాలంలో ఆల్కలైన్ వాటర్ అనీ, మినరల్ వాటర్ అనీ, ఆర్వో వాటర్ అనీ, ఇవి గాక మనం తాగే రెగ్యులర్ కొళాయి నీళ్లు... ఇలా మార్కెట్లో ఎన్నో రకాల నీళ్లు ఉన్నాయి. వీటిలో ఏ నీళ్లు మంచివి, ఏవి తాగాలి అనే ఆసక్తికర వివరాలను చెబుతున్నారు ఆర్మీ వైద్యులు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బఖ్తాయార్ చౌదరి.
మొబైల్ యుగం వచ్చాక మరుపు అన్నది మరింతగా పెరిగిపోతోంది. అసలీ మతిమరుపును ఎలా జయించాలో, ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలో చెబుతున్నారు ఆర్మీ వైద్యుడు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బఖ్తాయార్ చౌదరి.
దాదాపు 30 ఏళ్లుగా విద్యకు నోచుకోని వేలాది మంది పిల్లలకు ఉచితంగా చదువులందిస్తున్న HEAL, Health And Education for All అనే ఎన్జీవో ఇటీవలే హైదరాబాద్ పంజాగుట్టాలో HEAL వైద్య సేవల సెంటర్ని ప్రారంభించింది.
ఒంట్లో అనేక హార్మోన్ల పనితీరును ప్రభావితం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తి బాగుండేలా చేయడంలో విటమిన్-డి పాత్ర చాలా ప్రధానమైంది. ఐతే మనలో వందలో 98 మందికి విటమిన్-డి లోపం కనిపిస్తోంది. దీంతో అనేక జబ్బులు కూడా కనిపిస్తున్నాయి.
పిల్లలు ఇంట్లో వండిన ఫుడ్ కంటే కూడా పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు, బిర్యానీలు, ఐస్ క్రీమ్స్ వీటికే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ ఫుడ్ లో కేవలం కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడమే కాకుండా, అనవసరమైన ఫ్లేవర్లు, కలర్లు, ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటారు. అందుకే వీటిని జంక్ ఫుడ్ అంటారు. పిల్లల్లో జంక్ ఫుడ్ అలవాటును ఎలా మాన్పించాలో, ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే ఎలాంటి ఆహారాలను తయారు చేసి పెట్టవచ్చో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ ఎక్స్ పర్ట్ డాక్టర్ లహరి సూరపనేని.
హైబీపీ సమస్య ఉంటే బీపీ తగ్గుతుంది. ఇది హార్ట్ ఎటాక్ రిస్కును గణనీయంగా తగ్గిస్తుంది. అలసట, చికాకు లాంటి నెగెటివ్ మూడ్స్ ని తగ్గించి పాజిటివిటీ, టాలరెన్స్ లెవెల్స్ పెంచుతుంది. ఇంకా లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అలర్ట్ నెస్, ఫోకస్, మెమొరీ పవర్ కూడా పెరుగుతాయి. ఇవండీ కునుకు వల్ల లాభాలు.