షుగర్ జబ్బు ఉంటే ఏం తినాలిఅనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. కొందరేమో అన్నం మానేయాలి అంటారు. కొందరేమో చపాతి తినాలి అంటారు. ఇప్పుడు మిల్లెట్ డైట్, కీటో డైట్లు, ఇంటర్ మిట్టెంట్ డైట్లు కూడా వచ్చి చేరాయి.
నిజానికి ప్రీ డయాబెటిక్ లేదా బోర్డర్ లైన్ డయాబెటిక్ అని రీడింగ్ రాగానే మరీ బెంబేలెత్తిపోవాల్సిన పనేం లేదు. కాకపోతే, ఆహారం, శారీరక వ్యాయామం, నిద్ర, స్ట్రెస్ విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే మధుమేహం గీత అవతలకు దాటకుండా జాగ్రత్త పడొచ్చు. మరీ ముఖ్యంగా ప్రీ డయాబెటిక్ అని తెలిసిన వాళ్లకోసం ఆహారపంగా బెస్ట్ డైట్ ప్లాన్ చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కన్సల్టెంట్ డాక్టర్ లహరి సూరపనేని
షుగర్ జబ్బు ఉంటే ఏం తినాలి? ఏం తినరాదు? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. కొందరేమో అన్నం మానేయాలి అంటారు. కొందరేమో అన్నం తినొచ్చు అంటారు. కొందరేమో చపాతి తినాలి అంటారు. ఇప్పుడు మిల్లెట్ డైట్, కీటో డైట్లు, ఇంటర్ మిట్టెంట్ డైట్లు కూడా వచ్చి చేరాయి. అందుకే షుగర్ కి ఏం తినాలనే విషయంలో పెద్ద గందరగోళం ఎప్పుడూ ఉంటుంది. మరీ ముఖ్యంగా షుగర్ ఉంటే అన్నమా? చపాతీనా? అన్నది ఓ పెద్ద భేతాళప్రశ్న.