ఉద్యోగ రీత్యా కావచ్చు, జీవితంలో సెటిలవ్వాలని కావచ్చు, ఇంకా రకరకాల వేరే ఇతర కారణాలతో కావచ్చు… ఇటీవలికాలంలో పెళ్లిళ్లు కాస్త ఆలస్యమవుతున్నాయనే చెప్పాలి. ఇది ఓ రకంగా మంచిదే. అయితే లేటు మ్యారేజెస్ అనేవి కొన్ని రకాల ఇబ్బందుల్ని మాత్రం తెచ్చిపెడతాయి. ముఖ్యంగా గర్భం, కాన్పు విషయాల్లో ఆ ఇబ్బంది ఎదురవ్వచ్చు. లేటు మ్యారేజీల గురించి, పిల్లల్ని కనడానికి సరైన వయసు గురించి, ఇంకా భవిష్యత్తులో తల్లిడండ్రుల అవసరం లేకుండానే పిల్లల్ని ల్యాబ్ లో పుట్టిస్తారా.. అనే విషయాలను చెబుతున్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ.