ప్రకృతిలో ప్రతీ దృగ్విషయానికి రెండు కోణాలుంటాయి. సైన్స్ ఆవిష్కరిస్తున్న టెక్నాలజీ విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. నిరంతరాయంగా అప్డేట్ అయ్యే టెక్నాలజీని మనం మంచికి ఉపయోగిస్తామా, చెడుగా వాడతామా అన్నదే ప్రధాన అంశం. ఇటీవలికాలంలో విప్లవాత్మకంగా ముందుకొస్తున్న ChatGPT లెర్నింగ్ మోడ్యూల్ అనేది విద్యారంగంలో కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ChatGPT అనేది స్టూడెంట్సుకి మంచిదా, చెడ్డదా, ఎలా అర్థం చేసుకోవాలో విశ్లేషిస్తున్నారు విద్యాబోధన రంగంలో అపార అనుభవం కలిగిన స్లేట్ స్కూల్స్ కరెస్పాండెంట్ వాసిరెడ్డి అమర్ నాథ్.