మన శరీరంలో కాలేయం బాహుబలి లాంటిది. ఒంటి చేత్తో వందల పనులు చేసేస్తుంది. చాలావరకు ఎన్ని ఇబ్బందులొచ్చినా సొంతంగా తట్టుకుని నయం చేసుకునే అద్భుత సామర్థ్యం కాలేయం సొంతం. అయినప్పటికీ మారిన జీవనశైలి, అలవాట్లు, అనేక కారణాల వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలేయానికి వచ్చే సమస్యలు, వాటికి చికిత్సలు, అసలు కాలేయానికి ఇబ్బందులు రాకుండా చూసుకోవడమెలా అనే వివరాలను సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆర్వీ రాఘవేంద్రరావు.