జనరల్ గా మనలో చాలామంది ఏ మధ్యాహ్నం పూటో కాసేపలా కునుకు తీస్తుంటాం. డే టైం పది నిమిషాలకు తగ్గని అరగంటకు మించని నిద్రను సైంటిఫిక్ పరిభాషలో న్యాప్ అని పిలుస్తారు. ఇలా డే టైంలో తీసే ఈ కునుకు వల్ల బోల్డు లాభాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. హైబీపీ సమస్య ఉంటే బీపీ తగ్గుతుంది. ఇది హార్ట్ ఎటాక్ రిస్కును గణనీయంగా తగ్గిస్తుంది. అలసట, చికాకు లాంటి నెగెటివ్ మూడ్స్ ని తగ్గించి పాజిటివిటీ, టాలరెన్స్ లెవెల్స్ పెంచుతుంది. ఇంకా లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అలర్ట్ నెస్, ఫోకస్, మెమొరీ పవర్ కూడా పెరుగుతాయి. ఇవండీ కునుకు వల్ల లాభాలు. ఇంకెందుకాలస్యం.. మీరు ఓ కునుకెయ్యండి, ఐతే ఆ కునుకు అరగంటకు మించకుండా, మధ్యాహ్నం మూడులోపే ప్లాన్ చేసుకోండి.
Have a good nap.